From28March | యువ ఆటగాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. కొత్త స్టార్‌ల ఎంట్రీ
From28March | యువ ఆటగాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. కొత్త స్టార్‌ల ఎంట్రీ
From28March | యువ టాలెంట్‌పై ఐపీఎల్ దృష్టి
డొమెస్టిక్ ప్రదర్శనలే సెలెక్షన్‌కు కీలకం
ఫినిషర్లు, పేసర్లకు పెరిగిన డిమాండ్
గేమ్ చేంజర్లుగా మారనున్న కొత్త తరం
From28March | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐపీఎల్ అంటే మొదటగా వినిపించే పదం స్టార్ ప్లేయర్ల హంగామా, ఆ తర్వాత వాళ్ళు బాదే భారీ సిక్సర్లు, అడుగడుగునా హై టెన్షన్ క్రియేట్ చేసే మ్యాచ్‌లు మాత్రమే… కానీ ఈసారి మాత్రం అంతేనా అంటే… అంతకు మించి అనే టాక్ వినిపిస్తోంది. ఈ సీజన్ కొత్త టాలెంట్‌కు పెద్ద వేదికగా నిలువబోతోంది.. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ మొదలవబోతున్న వేళ, ఈసారి యంగ్ ప్లేయర్లు దుమ్ము రేపబోతున్నారు అనే మాట మరింత స్ట్రాంగ్‌గా వినిపిస్తోంది.

దేశీయ క్రికెట్‌లో మెరిసిన పలువురు యువ ఆటగాళ్లు ఈసారి ఐపీఎల్ జట్ల దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, అండర్-19 టోర్నీల్లో అదిరిపోయే ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లు ఫ్రాంచైజీల రాడార్‌లోకి ప్రవేశించారు. సెలెక్షన్ ప్రక్రియలో గత రెండు సీజన్ల డొమెస్టిక్ స్టాట్స్, స్ట్రైక్ రేట్లు, డెత్ ఓవర్లలో మెరుగైన ప్రదర్శన వంటి అంశాలను జట్లు ప్రాధాన్యంగా తీసుకున్నట్లు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక అండర్-19 వరల్డ్‌కప్‌లో మెరిసిన ఆటగాళ్లకు ఐపీఎల్ ఎప్పటి లాగే ఒక “లాంచ్‌ప్యాడ్” గా మారబోతోంది. ఇలాగే ఇంతకు ముందు కూడా అనేక మంది యువ ఆటగాళ్లు ఈ లీగ్ ద్వారానే జాతీయ జట్టుకు చేరిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అదే ట్రెండ్ ఈసారి కూడా కొనసాగుతుందని నిపుణుల అంచనా. “యువ ఆటగాళ్లకు పెద్ద స్టేజ్‌లో ఆడే అవకాశం ఇవ్వడం ఐపీఎల్ బలం” అనే అభిప్రాయం మాజీ క్రికెటర్లలో సాధారణంగా వినిపిస్తోంది.

ఈసారి ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం మరొకటుంది. అదే- కొత్త ఫినిషర్లు, ఫాస్ట్ బౌలర్ల కోసం పెరిగిన పోటీ. మ్యాచ్ క్రిటికల్ పొజిషన్ లో ఉండగా క్రీజ్ లోకి వచ్చి, చివరి ఓవర్లలో మ్యాచ్‌ను తిప్పగల బ్యాటర్లు, 140+ స్పీడ్‌తో బౌలింగ్ చేసే పేసర్ల కోసం ఫ్రాంచైజీలు భారీ అంచనాలు పెట్టుకుని పెట్టుబడులు పెట్టాయి. డెత్ ఓవర్లలో ఎకానమీ రేటు తగ్గించగల బౌలర్లు, పవర్ హిట్టింగ్ చేయగల యువ బ్యాటర్లు ఇప్పుడు జట్లకు కీలక ఆస్తిగా మారుతున్నారు.
గత ఐపీఎల్ మ్యాచుల ఆధారంగా నమ్మకమైన గణాంకాలను గమనిస్తే, గత మూడు సీజన్లలో మ్యాచ్‌ల ఫలితాల్లో సుమారు 30–40 శాతం వరకు చివరి ఐదు ఓవర్ల ప్రదర్శనే కీలకం అని స్పోర్ట్స్ అనలిటిక్స్ నివేదికలు చెబుతున్నాయి. దీంతో “ఫినిషర్” పాత్రకు విలువ పెరిగింది. అదే సమయంలో, డొమెస్టిక్ క్రికెట్‌లో వేగంగా ఎదుగుతున్న పేసర్లు కూడా ఐపీఎల్‌లో తమ సత్తా చాటేందుకు రెడీగా ఉన్నారు.
ఐపీఎల్ 2026లో పాత స్టార్‌లతో పాటు ఈ కొత్త తరం ఆటగాళ్లు కూడా గేమ్ చేంజర్లుగా, సరికొత్త శక్తిగా నిలవబోతున్నారు. క్రిడాభిమానులకు ఇది కొత్త ఉత్సాహం, ప్లేయర్స్‌కు మాత్రమే కాక, జట్లకు కూడా ఇది కొత్త అవకాశాల వేదిక. ఇలాంటి ఒక్క అవకాశం దొరికితే చాలు… ఈ యువ ఆటగాళ్లు “నెక్స్ట్ బిగ్ స్టార్”లుగా ఎదగడం ఖాయం అనే విశ్వాసం బలంగా వినిపిస్తోంది.
