మహిళా కానిస్టేబుళ్లకు సన్మానం..

మహిళా కానిస్టేబుళ్లకు సన్మానం..

పరకాల పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవ వేడుకలు

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని పోలీస్ పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పరకాల సర్కిల్ ఇన్స్పెక్టర్ వి క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పరకాల సర్కిల్ ఇన్స్పెక్టర్ వి క్రాంతికుమార్ పరకాల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లను శాలువాలతో ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా సిఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ దేశ భద్రత, సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమన్నారు. కేవలం ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో మహిళామణులు రాణిస్తూన్నారని అన్నారు. అనంతరం పరకాల పోలీస్ స్టేషన్ ఎస్ఐలు ఎం రమేష్, పి పవన్ మహిళా కానిస్టేబుళ్లకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుళ్లు సిఐ క్రాంతి కుమార్ కు, ఎస్సైలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్
సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply