బీఆర్ఎస్ వి నాయకుల ముందస్తు అరెస్ట్…

బీఆర్ఎస్ వి నాయకుల ముందస్తు అరెస్ట్…

బెజ్జంకి, ఆంధ్రప్రభ : జాబ్ క్యాలెండర్, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బి.ఆర్.ఎస్.వి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బి.ఆర్.ఎస్.వి నియోజకవర్గ నాయకుడు పొట్లపల్లి శివకృష్ణ, మండల అధ్యక్షుడు చాతవేణి మహేష్ యాదవ్‌ను బెజ్జంకి పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ముందస్తు అరెస్టులపై బి.ఆర్.ఎస్.వి నాయకులు తీవ్రంగా స్పందించారు. ప్రజల సమస్యలపై శాంతియుతంగా ఆందోళన చేపట్టే హక్కును ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు. ఇటువంటి చర్యలతో తమ ఉద్యమాన్ని ఆపలేరని, జాబ్ క్యాలెండర్, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు