samantha |సోషల్ మీడియాలో ట్రెండింగ్

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : చెన్నైలో ముగ్గురు పిల్లల్లో అందరికంటే చిన్నదైన సమంతకు అసలు నటనలోకి రావాలనే ఆలోచనే లేదట. కాలేజీ తర్వాత వచ్చిన ఒక చిన్న గ్యాప్‌లో సరదాగా మోడలింగ్ వైపు అడుగులు వేసి, అలా ఒక సినిమా ఆడిషన్‌కు వెళ్లి అనుకోకుండా హీరోయిన్ అయిపోయినట్లు ఆమె వెల్లడించింది.
ఇక సమంత లేటెస్ట్ ఫోటోషూట్ ఆమె అభిమానులకు ఒక విజువల్ ట్రీట్ అని చెప్పాలి. సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలు చేస్తూనే, ఇలాంటి గ్లామరస్ షూట్స్ తో కూడా ఆమె తన క్రేజ్ ఏంటో నిరూపించుకుంటోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది.
స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న మా ఇంటి బంగారం సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ బేబీ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత నందిని రెడ్డి, సమంత కాంబినేషన్ లో వస్తున్న ఆ సినిమాపై ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు కూడా ఆకట్టుకోవడంతో సినిమా సమ్మర్ సీజన్ లో మంచి హిట్ అవుతుందని మూవీ లవర్స్ భావించారు.



























