KesineniNani PoliticalRow | ఈర్ష్య, ద్వేషంతో ఆరోపణలు…
KesineniNani PoliticalRow | ఈర్ష్య, ద్వేషంతో ఆరోపణలు…
ఒక్క శాతం నిజం అయినా ఉందా
దిగజారుడు రాజకీయాలకు నాని బ్రాండ్ అంబాసిడర్
‘ప్రధాని, రాష్ట్రపతికి ఫిర్యాదులా…
ఇక మిగిలింది ట్రంప్, పుతిన్‌కే లేఖలు రాయాలి
నాని వల్ల ఊకలో ఈక కూడా ఊడదు..
నిరాధార ఆరోపణలు మానేసి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి
మాజీ ఎంపీ కేసినేని నానికి ఎంపీ చిన్ని కౌంటర్..
KesineniNani PoliticalRow | ఆంధ్రప్రభ విజయవాడ : ఒక్క శాతం నిజం కూడా లేకుండా రాజకీయ స్వార్థం తన ఉనికి కోసం ఆరోపణలు చేస్తున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసునేని శివనాథ్ పేర్కొన్నారు. మాజీ ఎంపీ కేశినేని నానిపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈర్ష్య, ద్వేషం, రాజకీయ కక్షతోనే నాని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఆయన రాస్తున్న లేఖల్లో ఒక్క శాతం కూడా వాస్తవం లేదని మండిపడ్డారు. దిగజారుడు రాజకీయాలకు నాని కొత్త నిర్వచనం చెబుతున్నారని, తాడిచెట్టులా ఎదిగినా కనీస ఇంగితజ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతి అంశంపైనా ప్రధాని, రాష్ట్రపతికి ఫిర్యాదులు చేయడం హాస్యాస్పదంగా మారిందని, ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, కేఏ పాల్కూ లేఖలు రాయడమే మిగిలిందంటూ ఎద్దేవా చేశారు. నాని చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు లేవని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని పేర్కొన్నారు. నాని వల్ల “ఊకలో ఈక కూడా ఊడదని” వ్యాఖ్యానించిన ఎంపీ చిన్ని, నిరాధార ఆరోపణలు మానేసి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు.
