Rakta Charitra | రీ-రిలీజ్ ఎప్పుడంటే..?
Rakta Charitra | రీ-రిలీజ్ ఎప్పుడంటే..?
Rakta Charitra | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: తెలుగు సినీ ప్రేక్షకులను తీవ్ర కథనం, శక్తివంతమైన పాత్రలతో ఆకట్టుకున్న ‘రక్తచరిత్ర’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని జూలై 17న రీ-రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమాను మరోసారి పెద్ద తెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రాజకీయ, ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. సినిమా కథనం, నటీనటుల ప్రదర్శన, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మార్క్ సినిమా ఇది. ఇప్పుడు కొత్త తరం ప్రేక్షకులకు కూడా ఈ సినిమాను థియేటర్లలో చూసే అవకాశం దక్కనుంది.
ఇప్పటికే ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు తమ ఉత్సాహాన్ని పోస్టుల రూపంలో పంచుకుంటున్నారు. ఈ సినిమారీ రిలీజ్ కు సంబంధించిన ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు. జూలై 17న మరోసారి పెద్ద తెరపై సందడి చేయనుంది. ‘రక్తచరిత్ర’ ప్రేక్షకులను మళ్లీ అదే స్థాయిలో అలరిస్తుందా అనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్శ అభిమానులకు మరోసారి ఆ సినిమా అనుభూతిని ఆస్వాదించే ప్రత్యేక అవకాశంగా మారనుంది.
