ఆసుపత్రిలో ప్రమాదాలపై అవగాహన..

ఆసుపత్రిలో ప్రమాదాలపై అవగాహన..

జి జి హెచ్ లో ఫైర్ మాక్‌డ్రిల్
సిబ్బందికి ప్రత్యక్ష శిక్షణ, భద్రతా సూచనలు..
అగ్నిప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యం గా

ఆంధ్రప్రభ విజయవాడ : అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా విజయవాడలోని జి జి హెచ్ లో శుక్రవారం అగ్నిభద్రతపై అవగాహన సదస్సు, ఫైర్ మాక్‌డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవాడ ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో, ఏ.డి.ఎఫ్.ఓ సూర్య ప్రకాశ రావు పర్యవేక్షణలో జరిగింది.
మాక్‌డ్రిల్ సందర్భంగా ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించిన పరిస్థితుల్లో తీసుకోవాల్సిన అత్యవసర చర్యలు, రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానాలు, అగ్నిమాపక పరికరాల వినియోగంపై ఆసుపత్రి సిబ్బందికి ప్రత్యక్షంగా శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఏ.డి.ఎఫ్.ఓ సూర్య ప్రకాశరావు మాట్లాడుతూ ఆసుపత్రులు వంటి రద్దీ ప్రదేశాల్లో అగ్నిప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాల అమలు, సిబ్బంది అప్రమత్తత అత్యంత కీలకమని తెలిపారు. కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ సిబ్బంది, వైద్య సిబ్బంది, ఆసుపత్రి అధికారులు పాల్గొని అగ్నిభద్రతపై అవగాహన పెంపొందించుకున్నారు.

Leave a Reply