sachin 53years| క్రికెట్ గాడ్‌కు శుభాకాంక్షల వెల్లువ
sachin 53years| క్రికెట్ గాడ్‌కు శుభాకాంక్షల వెల్లువ
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : క్రికెట్ గాడ్, భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు నేడు. కోట్ల మంది క్రికెట్ అభిమానుల గుండెల్లో కొలువుదీరిన ఈ క్రికెట్ గాడ్.. నేటితో 53వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, పలువురు ప్రముఖులు సచిన్‌కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో ముంబయిలోని ఆయన నివాసం వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అభిమానుల సమక్షంలో సచిన్ సచిన్ కేక్ కట్ చేశాడు. అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ సరదాగా గడిపాడు. ఈ వేడుకలో ఆయన సతీమణి అంజలి కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సచిన్ వీరాభిమాని సుదీర్ కూడా హాజరయ్యారు. మరోవైపు, సోషల్ మీడియాలో సచిన్‌కు బర్త్ విషెస్ వెల్లువెత్తాయి. ప్రముఖులు, సెలబ్రిటీలు, ప్రస్తుత, మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సచిన్ తనయుడు అర్జున్ స్పెషల్ విషెస్!
సచిన్ కుమారుడు అర్జున్ తెందుల్కర్ తన తండ్రికి ఆన్‌లైన్‌లోనే తండ్రికి శుభాకాంక్షలు చెప్పాడు. ప్రస్తుతం అర్జున్ ఐపీఎల్ ఆడుతున్నాడు. తండ్రిని నేరుగా కలువలేకపోయాడు. ఆన్‌లైన్‌లోనే సచిన్‌కు శుభాకాంక్షలు చెప్పిన అర్జున్ కేక్‌ను మాత్రం తినలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, అలా అతడు తినకపోవడానికి ఓ కారణముంది. ప్రస్తుతం అర్జున్ ‘ఆఫ్ షుగర్’ డైట్‌లో ఉన్నాడు. దీంతో కేకు రుచి కూడా చూడలేదు.
స్పోర్ట్స్ ఐకాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ‘‘మా స్పోర్ట్స్ ఐకాన్ సచిన్ తెందుల్కర్‌కు బర్త్‌డే విషెస్. ప్రపంచ క్రికెట్‌కు మీరు అందించిన భాగస్వామ్యం అద్భుతం. ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. మీ అద్భుత ఆటను చూడటం మా అదృష్టం. మీ సానుభూతి క్యారెక్టర్, మానవత్వం అనిర్వచనీయం. సమాజంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు’’ అని ఐసీసీ ఛైర్మన్ జై షా పోస్టు చేశారు.
‘‘అంతర్జాతీయంగా 664 మ్యాచులు. మొత్తం 34,357 పరుగులు. వంద సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడు. లెజెండరీ క్రికెటర్ సచిన్ తెందుల్కర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు’’ – బీసీసీఐ.
‘‘హ్యాపీ బర్త్‌డే పాజీ.. నీతో కలిసి మైదానం పంచుకోవడం గొప్ప గౌరవం. అంతకంటే ఎన్నో అంశాలు నేర్చుకోవడం పెద్ద విషయం. క్రమశిక్షణ, మానవత్వం, ప్రేమ నిరంతరం మమ్మల్ని ప్రభావితం చేశాయి. ఎన్నో జ్ఞాపకాలు మాకు స్ఫూర్తిగా నిలుస్తాయి’’ – యువరాజ్ సింగ్.
సచిన్ టెండూల్కర్ రికార్డుల వివరాలు:
మొత్తం మ్యాచ్‌లు: 664 (200 టెస్టులు, 463 వన్డేలు, 1 T20I).
మొత్తం పరుగులు: 34,357.
సెంచరీలు: 100 (టెస్టుల్లో 51, వన్డేల్లో 49).
టెస్ట్ పరుగులు: 15,921 (అత్యధికం).
వన్డే పరుగులు: 18,426 (అత్యధికం).
ఇతర రికార్డులు: వన్డేల్లో ద్విశతకం (200*) సాధించిన మొదటి క్రికెటర్
