కర్నూలు జిల్లాలో ఉత్సాహంగా ‘జలధార-జలహారతి’

కర్నూలు జిల్లాలో ఉత్సాహంగా ‘జలధార-జలహారతి’

  • గునపం చేతబట్టి పూడికతీతలో పాల్గొన్న కలెక్టర్

కృష్ణగిరి , ఆంధ్రప్రభ: జిల్లాలో భూగర్భ జలాల పెంపు, జల వనరుల పరిరక్షణే ధ్యేయంగా చేపట్టిన “జలధార–జలహారతి” 100 రోజుల కార్యక్రమం కృష్ణగిరి మండలం అమకతాడు గ్రామంలో ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం భద్రుడు చెక్‌డ్యామ్‌లో పూడికతీత పనులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి శ్రీకారం చుట్టారు

చెక్‌డ్యామ్ వద్ద ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్, అనంతరం స్వయంగా గునపం చేతబట్టి కూలీలతో కలిసి పూడికతీత పనుల్లో పాల్గొన్నారు. ఇలా కలెక్టర్ క్షేత్రస్థాయిలో నేరుగా శ్రమదానం చేయడం అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల్లో సరికొత్త స్ఫూర్తిని నింపింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘‘నీటి వనరులను కాపాడుకోవడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం. పూడికతీత పనుల ద్వారా చెరువులు, చెక్‌డ్యామ్‌లలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి. తద్వారా ఈ ప్రాంత రైతులకు భవిష్యత్తులో సాగునీటి కష్టాలు తీరి దీర్ఘకాలిక ప్రయోజనాలు అందుతాయి.‘‘ అని అన్నారు

ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భవిష్యత్ తరాల కోసం జల సంరక్షణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని అధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Leave a Reply