వృద్ధురాలి కాళ్లపై ఎక్కిన ఆర్టీసీ బస్సు
వృద్ధురాలి కాళ్లపై ఎక్కిన ఆర్టీసీ బస్సు
పలమనేరు,ఆంధ్రప్రభ : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లోకి వస్తున్న బస్సు ప్రమాదవశాత్తు ఓవృద్ధురాలి కాళ్లపై ఎక్కించింది. చిత్తూరు నుంచి పలమనేరు బస్టాండ్ లోకి వస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు (ఏపీ 39 యూ.వై 5994) టవర్ క్లాక్ వద్ద గంటాఊరు కాలనీకి చెందిన వృద్ధురాలు కామాక్షమ్మపై బస్సు ముందు చక్రం ఎక్కింది.ఈప్రమాదంలో రెండు కాళ్లపై నుంచి చక్రం వెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను 108 వాహనంలో పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
