ఆలయ అభివృద్ధికి 2.50 లక్షల విరాళం…

ఆలయ అభివృద్ధికి 2.50 లక్షల విరాళం…

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులు తమ వంతు సహకారం అందిస్తూ ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఒక భక్త కుటుంబం రూ.2.50 లక్షల విరాళం ఆదివారం అధికారులను కలిసి అందజేసారు.

కోమరిగిరిపట్నం గ్రామానికి చెందిన కోప్పడి Ramesh వారి కుటుంబ సభ్యులు అమ్మవారి సేవా కార్యక్రమాలు, ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.2,50,000 (రెండు లక్షల యాభై వేల రూపాయలు) విరాళాన్ని ఆలయ అధికారులకు ఆన్‌లైన్ చెల్లింపు రూపంలో అందజేశారు. అధికారులు దాతకు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వచనం అనంతరం ప్రధానాలయ సూపర్నెంట్ చందు శ్రీనివాస్ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.

Leave a Reply