Delhi | క్రైమ్ సిరీస్ చూసి భార్య హత్య..!
ఆస్తి వివాదమే కారణం.. మూడు రోజుల తర్వాత నిందితుడి అరెస్ట్
Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తూర్పు ఢిల్లీలో జరిగిన సంచలన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 62 ఏళ్ల సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్ కమల్ సింగ్ ను అరెస్ట్ చేశారు. ఆస్తి వివాదం నేపథ్యంలో జులై 30న తన భార్య కోమల్ సింగ్ను కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు హాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందిన ‘ది స్టేర్‌కేస్’ క్రైమ్ సిరీస్‌ను చూసి, అందులోని విధానాన్ని అనుసరించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
హత్య అనంతరం ఘటనాస్థలంలోని ఆధారాలను చెరిపేసేందుకు ప్రయత్నించిన నిందితుడు నగదుతో పరారయ్యాడు. ప్రత్యేక బృందాలు మూడు రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టి, చివరకు మథుర రైల్వే స్టేషన్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడి వద్ద ఉన్న నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరిన్ని వివరాల కోసం పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
