శిక్షణా తరగతులు పార్టీ బలోపేతానికి దోహదం చేస్తాయి

శిక్షణా తరగతులు పార్టీ బలోపేతానికి దోహదం చేస్తాయి

  • యూనిట్ ఇంచార్జి కె. వరలక్ష్మి

పాయకాపురం, ఆంధ్రప్రభ:

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో అందించిన సూచనలు, సలహాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని 64వ డివిజన్ టీడీపీ యూనిట్ ఇంచార్జి కె. వరలక్ష్మి అన్నారు. టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో యూనిట్, క్లస్టర్ ఇంచార్జిలకు నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ, పార్టీ సీనియర్ నాయకులు అందించిన మార్గదర్శకాలు, సూచనలు పార్టీ బలోపేతానికి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన దిశానిర్దేశం, ప్రజల్లో మరింత చురుకుగా పనిచేయాలన్న సూచనలు తమకు ప్రేరణనిచ్చాయని తెలిపారు. పార్టీ అభివృద్ధి, సంస్థాగత బలోపేతం కోసం ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో శిక్షణా తరగతులు కీలక పాత్ర పోషిస్తాయని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

Leave a Reply