కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు..

నాగర్ కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సమక్షంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు.
బిజినపల్లి మండలం బోరుసుగడ్డ తండా గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ లలిత రవి నాయక్, ఉప సర్పంచ్ చావులి చందు, వార్డ్ సభ్యులు కేసరి, రాజు, జ్యోతి, అనూష మరియు ఇతర గ్రామ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అదే మండలంలోని గంగారం పెద్ద తండా గ్రామం నుంచి సర్పంచ్ గోపాల్ నాయక్, వార్డ్ సభ్యులు బాధ్య నాయక్, కమ్లా నాయక్ మరియు గ్రామ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పాలెం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ మాజీ సర్పంచ్ బుర్రి యాదవ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మడ్డి బాల్‌రాం గౌడ్, మేస్త్రి సంఘం నాయకుడు వట్టెపు నాగయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తిమాజీపేట మండలం హేమ్ల నాయక్ తండా గ్రామం నుంచి సర్పంచ్ కేతావత్ కృష్ణకుమార్, గ్రామ నాయకులు, తాడూరు మండలం భల్లన్‌పల్లి గ్రామం నుంచి సర్పంచ్ భారతమ్మ నరసింహ ఆధ్వర్యంలో అంబేద్కర్ యువసేన సంఘానికి చెందిన సుమారు 50 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రజల మద్దతుతో, నాయకుల విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. గ్రామీణ అభివృద్ధికి ఇది కొత్త దిశగా మారుతుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
