షాదిఖాన ప్రారంభంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యం

షాదిఖాన ప్రారంభంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యం

48 గంటల డెడ్‌లైన్ విధించిన వైఎస్ఆర్సీపీ
వర్గపోరుతో షాది ఖానా ప్రారంభం నిలిచి వేసిన కూటమి నాయకులు
వైసీపీ ఇంచార్జి డాక్టర్ సుధీర్ ధారా

నందికొట్కూరు, ఆంధ్రప్రభ : వైఎస్ఆర్సీపీ హయాంలో రూ.1.50 కోట్లతో పూర్తయిన నందికొట్కూరు షాదిఖాన నూతన భవనాన్ని నెలలు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం ప్రారంభించకపోవడంపై వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డా.సుదీర్ దారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలో ఉన్న షాది ఖానా ను 48 గంటల అల్టిమేటం విధిస్తున్నామని అన్నారు.

ముస్లిం మైనారిటీలకు, పేదలకు ఉపయోగపడే ఈ భవనాన్ని 48 గంటల్లో ప్రారంభించాలి. లేకపోతే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం అని డా.సుదీర్ దారా హెచ్చరించారు. శిలాఫలకాలకే పరిమితం చేసిన టీడీపీ, కాంగ్రెస్ 1998 టీడీపీ ప్రభుత్వంలో అప్పటి స్పీకర్ ఫరూక్ శిలాఫలకం వేసి గాలికొదిలేశారు. 2014 కాంగ్రెస్ హయాంలో మరోసారి శిలాఫలకం వేసి పట్టించుకోలేదు. 2019-2024 వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.1.50 కోట్ల నిధులతో షాదిఖానను పూర్తి చేసి చూపించింది అని అన్నారు.

కూటమి ప్రభుత్వంపై పెద్ద ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు 26 ఏళ్లుగా ఊరిస్తున్న షాదిఖానను మా జగనన్న ప్రభుత్వం పూర్తి చేస్తే, కనీసం రిబ్బన్ కట్ చేయడానికి కూడా కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలకు తీరిక లేదా? ఇదేనా మైనారిటీల పట్ల మీ చిత్తశుద్ధి? ప్రచార ఆర్భాటాలకే తప్ప పేదలకు ఉపయోగపడే పనులు చేయడం చేతకాదా?” అని డా.సుదీర్ దారా ప్రశ్నించారు. పూర్తయిన షాదిఖానను తక్షణమే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, లేని పక్షంలో మైనారిటీల పక్షాన రోడ్డెక్కుతామని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసింది.

Leave a Reply