యూరియా దుకాణాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.
యూరియా దుకాణాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.
ఎరువుల నిల్వలు, విక్రయాలపై జిల్లా యంత్రాంగం నిఘా.
రైతులకు సరఫరా విధానాన్ని పరిశీలించిన కలెక్టర్.
కర్నూలులో యూరియా దుకాణాల తనిఖీలు.. రికార్డుల పరిశీలన.
ఎరువుల కృత్రిమ కొరతపై అప్రమత్తమైన అధికారులు
యూరియా ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు.
నిల్వలు, విక్రయ రికార్డులు, రైతులకు సరఫరా విధానంపై కలెక్టర్ పరిశీలన.
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రైతులకు యూరియా ఎరువులు సక్రమంగా అందుతున్నాయా..? ఎక్కడైనా అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా..? అనే అంశాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ శుక్రవారం నగరంలోని పలు యూరియా ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
మొదటగా పాత బస్టాండ్ సమీపంలోని సూర్య ట్రేడర్స్ యూరియా ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన అధికారులు అక్కడి యూరియా నిల్వలు, విక్రయ రికార్డులు, రైతులకు సరఫరా చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు, విక్రయ వివరాలు, నిల్వల లెక్కలు తదితర అంశాలను పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు.

బంగారుపేటలో మరో దుకాణంపై తనిఖీ
అనంతరం నగరంలోని బంగారుపేటలో ఉన్న శ్రీ శివ రామకృష్ణ యూరియా ఎరువుల దుకాణాన్ని కూడా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరుగుతున్నదా..? ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విక్రయాలు జరుగుతున్నాయా..? అనే అంశాలపై దృష్టి సారించారు. ఎరువుల కొరత పేరుతో అధిక ధరలకు విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు సమాచారం.
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
వ్యవసాయ సీజన్ నేపథ్యంలో రైతులకు యూరియా ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది. జిల్లాలో ఎరువుల సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు.
