CM Revanth Reddy | చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి..

CM Revanth Reddy | చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి..
CM Revanth Reddy | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రాష్ట్రంలో పంటల కొనుగోళ్ల వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ పూర్తిగా బోగస్ అని, ఎన్నికలకు ముందు చెప్పిందొకటి.. ఇప్పుడు చేస్తున్నదొకటని తీవ్రంగా విమర్శించారు.
ధాన్యం రైతుల చేతికి వచ్చినా ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని హరీశ్‌రావు ఆరోపించారు. తాలు, తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు.
ధాన్యం కొనుగోలు డబ్బులతో పాటు సన్న వడ్లకు హామీ ఇచ్చిన బోనస్ డబ్బులు కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం స్పందించాలని సూచించారు.
అన్ని పంటలను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, రైతులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు తన లేఖలో స్పష్టం చేశారు. ఈ లేఖ రాజకీయంగా చర్చనీయాంశమైంది.
