Road Accident | రైతు దుర్మరణం..
Road Accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిమ్మాపూర్ మండలం నూస్తులాపూర్ శివారులోని రాజీవ్ రహదారిపై ట్రాక్టర్‌ను డీసీఎం వాహనం ఢీకొట్టడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రైతు కాంతాల రాజిరెడ్డి ట్రాక్టర్‌పై కరీంనగర్ వైపు వెళ్తుండగా, అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ప్రమాద ధాటికి ట్రాక్టర్‌పై నుంచి ఎగిరి కిందపడిన రాజిరెడ్డిపై నుంచి డీసీఎం వాహనం దూసుకుపోవడంతో ఆయన తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ పరారీలో ఉండగా, అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
