Upasana | ఆడపులికి క్లీంకార పేరు – ధన్యవాదాలు తెలిపిన మెగా కోడలు
హైదరాబాద్ : హైదరాబాద్ లో ఉన్న ఆడపులికి క్లీంకార అనే పేరును అధికారులు నామకరణం చేశారు.. ఈ సందర్భంగా మెగాస్టార్ కోడలు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన (upasana) హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ (Nehru Zoological Park) బృందానికి ధన్యవాదాలు తెలిపింది. జూలో ఉన్న ఒక ఆడపులికి తన కూతురి పేరు క్లీంకార అని పెట్టడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తన సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ పెట్టింది. ఒక సంవత్సరం క్రితం, అది కేవలం ఒక చిన్న పులి పిల్ల. కానీ ఈ రోజు అల్లరి చేసే ఆడపులి (female tiger) గా మారింది. నా కూతురు క్లీంకార పేరునే ఈ పులి కి పెట్టడం చాలా సంతోషంగా ఉంది.
ఈ విధంగా ప్రేమాభిమానాలు చూపించిన నెహ్రూ జూలాజికల్ పార్క్ బృందానికి ధన్యవాదాలు. వన్యప్రాణులు అడవిలోనే ఉంటాయని మనం నమ్ముతుంటాం. అదేవిధంగా జంతువులను సంరక్షించే ప్రయత్నాలను సైతం మద్దతు తెలుపుతుంటాం. అని ఉపాసన పేర్కొన్నారు. అనంతరం తన కుమార్తె క్లీంకార (klin kaara), ఆడపులి క్లీంకాలతో కలిసి దిగిన ఫొటోను ఉపాసన పోస్ట్ చేసింది. కాగా , నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని పులి పిల్లలను ఉపాసన కొణిదెల దత్తత తీసుకుంది. తన కుమార్తె క్లీంకారతో కలిసి జూను సందర్శించిన ఆమె, అక్కడ వివిధ జంతువుల ఎన్‌క్లోజర్లను వీక్షించారు. అనంతరం జూపార్క్ డైరెక్టర్ డా.సునీల్ ఎస్. హిరేమత్‌ను కలిసి పులి పిల్లలను దత్తత తీసుకుంటున్నట్లు తెలియజేశారు. వాటి పోషణకు అవసరమైన నిధులను చెక్కు రూపంలో జూపార్క్ డైరెక్టర్‌కు అందజేశారు.
