దివ్యాంగ టీడీపీ కార్యకర్త సునీల్ కుటుంబానికి అండగా గద్దె క్రాంతికుమార్
దివ్యాంగ టీడీపీ కార్యకర్త సునీల్ కుటుంబానికి అండగా గద్దె క్రాంతికుమార్
రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత
పటమట, ఆంధ్రప్రభ : విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన దివ్యాంగుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త మద్దాల సునీల్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదకరమని టీడీపీ యువనేత గద్దె క్రాంతికుమార్ పేర్కొన్నారు. సునీల్ మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబాన్ని ఆటో నగర్ లోని ఇంటి వద్ద ఆదివారం పరామర్శించిన ఆయన, సునీల్ తల్లి మద్దాల విజయలలితకు తక్షణ సహాయంగా రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ శనివారం గుంటూరు జిల్లా మేడికొండూరు సమీపంలోని పాలవాగు అడ్డరోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సునీల్ తీవ్రంగా గాయపడి మృతి చెందారన్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన సునీల్ అకాల మరణం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సునీల్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మల్లెల లక్ష్మీనారాయణ, వడ్లపట్ల గోపాలకృష్ణ, జాస్తి సాంబశివరావు, కోనేరు రాజేష్, ఉప్పలపాటి దుర్గాప్రసాద్, నాదెళ్ల రాజేష్, కొర్రపాటి సురేంద్ర, జాస్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
