ఘనంగా యువనేత మండలి వెంకట్రామ్ జన్మదిన వేడుకలు..
ఘనంగా యువనేత మండలి వెంకట్రామ్ జన్మదిన వేడుకలు..
కోడూరు – ఆంధ్రప్రభ : జనసేన పార్టీ యువ నాయకులు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ జన్మదిన వేడుకలను కోడూరు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో కోడూరు ప్రధాన సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును జనసేన పార్టీ నేతలు కట్ చేసి మండలి వెంకట్రామ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భారీ బాణాసంచా కాల్చారు. మండల పార్టీ అధ్యక్షులు మరే గంగయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత, కోడూరు పట్టణ అధ్యక్షులు కోట రాంబాబు, కోడూరు, లింగారెడ్డి పాలెం పి ఎస్ ఎస్ చైర్ పర్సన్ లు పూత బోయిన కరుణ్ కుమార్, కోట సుబ్బారావు, బచ్చు వెంకటేష్, మాజీ సర్పంచ్ కనకాల వెంకటేశ్వరరావు, కడవకొల్లు శ్రీనివాసరావు, సనక జగన్, కాగిత రామారావు, బచ్చు పూర్ణచంద్రరావు పరిశే వెంకటేశ్వరరావు తో పాటు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
