అప్ర‌మ‌త్తంగా ఉండండి..

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ సూచన

భద్రాచలంలో తొలి ప్రమాద హెచ్చరిక జారీ
43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ: భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో తొలి ప్రమాద హెచ్చరిక (ఫస్ట్ వార్నింగ్) జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రస్తుతం గోదావరిలో 9,32,288 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోందని పేర్కొన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను ముందస్తుగా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా యంత్రాంగం వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోందని, అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, పుకార్లను నమ్మవద్దని, గోదావరి నది వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా 24×7 ఫ్లడ్ కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని కలెక్టర్ కోరారు. ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు: 08744-241950, 9392919743.