కళ్లాల్లోనే వరి ధాన్యం…..
కళ్లాల్లోనే వరి ధాన్యం…..
బిక్కనూర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా(Kamareddy District) బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో వరి ధాన్యం కుప్పలు ఎక్కడికక్కడే ఉండిపోయాయి. అధికారులు ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కానీ ఇప్పటివరకు ధాన్యం తూకం వేయకపోవడంతో కల్లాల్లోనే వరి ధాన్యం కుప్పలు ఉండిపోయాయి. గత 15 రోజులుగా రైతులు వరి ధాన్యం కుప్పల వద్దనే నిద్రపోవలసిన పరిస్థితి ఏర్పడింది.
అకాల వర్షాల(untimely rains) వల్ల వరి ధాన్యం తడిసిపోతుంది. దీంతో రైతులు ఎండిన ధాన్యాన్ని కుప్పలు చేసి తడవకుండా కాపాడుకుంటున్నారు. తక్షణమే వారి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని గ్రామ రైతులు కోరుతున్నారు. తేమ శాతం సైతం ఇప్పటివరకు ఎవరు పరిశీలించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఇబ్బందులను గమనించి తక్షణమే కాంటలు ప్రారంభించాలని రైతులు డిమాండ్(farmers demand) చేస్తున్నారు. కూలీల కొరత వల్ల కాంటలు ప్రారంభించలేకపోతున్నామని సంబంధిత సొసైటీ అధికారులు చెబుతున్నారు.

