హిందూ సమ్మేళనానికి బందోబస్తు కోరిన ప్రతినిధులు

కరిమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని మిల్స్ కాలనీ సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్‌ను శివనగర్–పెరుకవాడ హిందూ ధర్మ సమ్మేళన సమితి ప్రతినిధులు మంచాల కృష్ణమూర్తి, చింతం యాదగిరి కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ నెల 25వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు 34వ డివిజన్ శివనగర్ రామాలయంలో భారీ స్థాయిలో హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఐను వారు విజ్ఞప్తి చేశారు. సీఐను కలిసిన వారిలో గంజి రవీందర్, మేంగని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
