వేసవి క్రీడా శిబిరాల నిర్వహణ అభినందనీయం

వేసవి క్రీడా శిబిరాల నిర్వహణ అభినందనీయం

  • ఎస్ఐ మాలోత్ సురేష్

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : వేసవి ఉచిత క్రీడా శిబిరాల నిర్వహణ అభినందనీయమని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎస్ఐ మాలోత్ సురేష్ అన్నారు.ఆదివారం మండలంలోని జయపురం గ్రామంలో ఉచిత వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని దాతలు వంగాల ప్రవీణ్ రెడ్డి,విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు,కోచ్ నెలకుర్తి వీరారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడలను ఎస్ఐ మాలోత్ సురేష్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చాయంటే డిజిటల్ ఉపకరణాలతోనే ఎక్కువ కాలం వెలదీస్తారని వాటికి బదులుగా ఆటలతో శిక్షణ తీసుకుంటే శారీరక ఆరోగ్యం పెరగడంతో పాటు ఆటల్లోనూ రాణిస్తారని,విద్యార్థుల తల్లిదండ్రులు ఉచిత శిక్షణ శిబిరాల్లో చేర్చి ఆటల్లో శిక్షణ ఇస్తే పిల్లలు క్రీడల్లో ప్రతిభ చూపుతారని అన్నారు.

ఈ శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.జయపురం అంటేనే క్రీడలకు పుట్టినిల్లని ఉచిత శిక్షణ శిబిరాల నిర్వాహకులను కోచ్ నెలకుర్తి వీరారెడ్డిని అభినందించారు.ఈ కార్యక్రమంలో నెలకుర్తి అశోక్ రెడ్డి,విశ్రాంత పోలీస్ ఉద్యోగి నెలకుర్తి కృష్ణారెడ్డి,గ్రామస్తులు రావుల శీను,నెలకుర్తి నరసింహారెడ్డి,పాఠశాల ఉపాధ్యాయులు వెంకన్న తదితరులు ఉన్నారు.

Leave a Reply