ఉదయం పూటనే పనులు చేయాలి

ఉదయం పూటనే పనులు చేయాలి
- సర్పంచ్ మెస్రం గంగాదేవి ప్రభాకర్
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఉపాధి హామీ కూలీలు పనులను ఉదయం పూటనే చేయాలని అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని బాబాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మెస్రం గంగాదేవి ప్రభాకర్ అన్నారు. గురువారం ఉదయం పంచాయతీలోని రాజులగూడలో సందర్శించి ఉపాధి హామీ కూలీలు చేస్తున్న పనులను పరిశీలించారు ఈ సందర్భంగా సర్పంచ్ కూలీలతో మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరగడంతోఉపాధి హామీ పనులు ఉదయం 6 గంటల నుండి 10 గంటల లోపు పనులు ముగించాలని సర్పంచ్ కోరారు. పనులకు వచ్చే ముందు వెంట చల్లటి నీళ్లు తీసుకురావాలని అన్నారు. కూలీలకు పనులపై పలు సూచనలు ఇచ్చారు.
