Pallavi Gowd | వైద్యుల నిర్లక్ష్యమేనంటూ కుటుంబ సభ్యుల ఆరోపణలు
Pallavi Gowd | వైద్యుల నిర్లక్ష్యమేనంటూ కుటుంబ సభ్యుల ఆరోపణలు
Pallavi Gowd | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : గాంధీ ఆసుపత్రిలో వైద్యం వికటించి ఓ విద్యార్థిని మృతిచెందిన ఘటన కలకలం రేపింది. గాంధీ మెడికల్ కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న పల్లవి గౌడ్ చికిత్స పొందుతూ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఛాతీ సంబంధిత సమస్యతో ఇటీవల పల్లవి గౌడ్ ఆసుపత్రిలో చేరింది. మొదటి సర్జరీ విఫలం కావడంతో వైద్యులు రెండోసారి శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే రెండోసారి సర్జరీ చేసినప్పటికీ బ్లీడింగ్ ఆగలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని పల్లవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వారి ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
