కడంలో వీఓఏల ఆందోళన

కళ్లకు గంతలు కట్టుకొని నిరసన
కడం, మే 23 ఆంధ్రప్రభ: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఐకేపీ (ఇందిరా క్రాంతిపథం), సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ) వీఓఏలు సమ్మె బాట పట్టారు. ఈ నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత పద్ధతిలో నిరవధిక సమ్మె చేపట్టాలని ‘తెలంగాణ రాష్ట్ర ఐకేపీ, సెర్ప్ వీఓఏల జాయింట్ యాక్షన్ కమిటీ’ నిర్ణయించింది. ఈ మేరకు కడం మండల ఐకేపీ వీఓఏల ఆధ్వర్యంలో కడెం ఐకేపీ కార్యాలయం ఎదుట దీక్ష శిబిరంలో సమ్మెను నిర్వహిస్తున్నారు.
శనివారం వీఓఎల్‌లు తమకండ్లకు నల్ల గుంతలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐకేపీ వీఓఏల ఎంప్లాయిస్ అసోసియేషన్ కడెం మండల అధ్యక్షుడు బుక్య విక్రమ్ మండల నాయకులు పోతరాజుల లావణ్య చేనేని రవి మాట్లాడుతూ వీఓఏలకు నెలకు 26 వేల రూపాయలు కనీస వేతనం చెల్లించాలని, తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి, హెచ్‌ఆర్ పాలసీని వర్తింపజేయాలని, రూ.10 లక్షల ప్రమాద, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఐకేపీఓఏల పాల్గొన్నారు.
