టీఎస్ఆర్ గొప్ప సామాజిక సేవకుడు: బండే శ్రీనివాసరావు
కోడూరులో ఘనంగా టీఎస్ఆర్ తిరుపతి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు
కోడూరు, ఆంధ్రప్రభ : టీఎస్ఆర్ గ్రూప్ చైర్మన్, సినీ నిర్మాత, రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షుడు తిరుపతి శ్రీనివాసరావు గొప్ప సామాజిక స్పృహ కలిగిన నాయకుడని కోడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు అన్నారు.
గురువారం టీఎస్ఆర్ తిరుపతి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను బండే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోడూరు ప్రధాన సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్‌ను పార్టీ నాయకులతో కలిసి కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారీ బాణాసంచా కాల్చి ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బండే శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత 17 సంవత్సరాలుగా కోడూరు మండలంలో మెగా గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. కరోనా సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో నిరుపేదలకు అండగా నిలిచారని, కోడూరు మండలంలోనూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.
తన కుమారులను హీరోలుగా పరిచయం చేస్తూ విజయవంతమైన సినిమాలను నిర్మిస్తున్నారని, వేసవి కాలంలో చలివేంద్రాల ఏర్పాటు వంటి సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా సమాజ అభివృద్ధికి విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో తిరుపతి శ్రీనివాసరావు మరింత ఉన్నత స్థాయికి ఎదిగి రాజకీయ, సినీ, సేవా రంగాల్లో మరింత రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కోడూరు పీఏసీఎస్ డైరెక్టర్ పూతబోయిన శ్రీనివాసరావు, నీటి సంఘాల అధ్యక్షులు అప్పికట్ల రవీంద్రబాబు, బొలిశెట్టి వెంకటేష్, అద్దంకి పాండురంగారావు, గోగినేని సోమశేఖరరావు, పిల్లి మల్లికార్జునరావు, కాగిత శివప్రసాద్, తుంగల రాజేష్, బండే వెంకటేశ్వరరావు, కొక్కిలిగడ్డ జాన్ విల్సన్, వేముల వేలాద్రి, తిరుపతి వీరాంజనేయులు, గుంటూరు గిరి, ఉప్పాల పోతురాజు, మేడా శివాజీ, రమణతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
