విజయవాడ – వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఈరోజు వరుసగా రెండో షాక్ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రాసుక్యూషన్ తరపు వాదనలను తాము పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది. అలాగే సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఐఓకు, ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ న్యాయస్థానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంగా కోర్టును ధిక్కరించేలా వ్యవహరించారని ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం వెల్లడించింది.
Bail Rejected | వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేత ….
