డీజిల్ అయిపోయిందని నడి రోడ్డుపై దింపేసి..

డీజిల్ అయిపోయిందని నడి రోడ్డుపై దింపేసి..

ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్
పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రయాణికులు

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: డీజిల్ అయిపోయిందని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ప్రయాణికులను నడిరోడ్డుపై దించేశాడు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సోమవారం జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇబ్రహీంపట్నం రాగానే డీజిల్ అయిపోయింది. దీంతో బస్సు డ్రైవర్ ప్రయాణికులను నడి రోడ్డుపై దించేశాడు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ప్రయాణికులు నిలదీయడంతో తాను ఏం చేయలేనని చేతులెత్తేశాడు. ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారయ్యాడు. పోలీసులు ప్రయాణికులను ప్రైవేట్ వాహనాల్లో విజయవాడ పంపించారు.

Leave a Reply