Ration Rice | ఆకస్మిక తనిఖీ..

Ration Rice | ఆకస్మిక తనిఖీ..
Ration Rice, ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి పట్టణంలోని రేషన్ బియ్యం వ్యాపారి గోడౌన్ లో విజిలెన్స్, రెవెన్యూ అధికారులు సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణ పరిధిలోని ఎస్టీ కాలనీలో ఓ రేషన్ బియ్యం వ్యాపారి గోడౌన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్లు ఫిర్యాదు అందడంతో ఆకస్మికంగా తనిఖీ చేస్తే.. 50 కిలోల బరువు కలిగిన 148 రేషన్ బియ్యం బస్తాలను అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని రేషన్ బియ్యం వ్యాపారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
