మీనాక్షికి వెన్నుపోటు పొడిచారు..

మీనాక్షికి వెన్నుపోటు పొడిచారు..

  • రైతు బందుకు రామ్ రామ్
  • రాహుల్ బందుకు రైట్ రైట్
  • బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

వేములవాడ, ఆంధ్రప్రభ : సొంత పార్టీ నేతలకే వెన్నుపోటు పొడిచిన ఘనుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని స్వయంగా కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా బిజెపి నేతలకు సమాచారం అందించిన మోసకారి రేవంత్ రెడ్డి అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ అమలుకు నోచుకోని హామీలను ఇచ్చి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలను రేవంత్ రెడ్డి మోసగించారన్నారు.

మీనాక్షి నామినేషన్ తిరస్కరణ గురయ్యే సమాచారం బిజెపి నేతలకు అందించి సొంత పార్టీ నేతనే నట్టేట ముంచిన సీఎం రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి మోసగించాడన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం మరిచి రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ పై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.

కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్లిపోయాడని అందువల్లే అభివృద్ధి చేయలేకపోతున్నానని అబద్ధాలు చెబుతున్నాడన్నారు. కెసిఆర్ అప్పులు చేస్తే ప్రపంచంలోvఎక్కడ లేని విధంగా కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఉమ్మడి కరీంనగర్ తో పాటు చాలా జిల్లాలకు సాగునీరు అందించారన్నారు. కేసీఆర్ అప్పులు చేస్తే 200 రూపాయలు ఉన్న పింఛను రెండు వేలకు పెంచారని, 15 లక్షల మంది ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి పథకం అందించారన్నారు. రేవంత్ రెడ్డి రెండున్నర ఏళ్లలో అప్పు చేసి ఒక్క ఇటుక కూడా పేర్చ లేదన్నారు.

రాహుల్ బందు స్టార్ట్ చేశారు..

రైతుబంధుకు రామ్ రామ్ చెప్పి రాహుల్ బంధు స్టార్ట్ చేశారు. ప్రతి నెల ఢిల్లీకి కుప్పం కడుతూ తన పదవిని రెన్యువల్ చేసుకుంటున్నారన్నారు. రైతాంగానికి రైతు బంధు ఎగ్గొట్టారని 4000 పింఛన్ అందించడం లేదు. విద్యార్థినిలకు స్కూటీలు పంపిణీ లేదు కళ్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం లేదు. ఇచ్చిన ఒక హామీ కూడా అమలు చేయడం లేదు.

Leave a Reply