మహిళా చట్టాలపై అవగాహన అవసరం

మహిళా చట్టాలపై అవగాహన అవసరం

  • మున్సిపల్ చైర్‌పర్సన్ నాగలక్ష్మి

ధర్మపురి, ఆంధ్రప్రభ:
మహిళలు మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి సూచించారు.

జగిత్యాల జిల్లా మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం మున్సిపల్ కార్యాలయంలో మహిళల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా POSH Act–2013 (Prevention of Sexual Harassment) పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ మహిళలపై వేధింపుల నిరోధక చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని తెలిపారు. మహిళల భద్రత, గౌరవం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అనేక చట్టాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా కార్యాలయాలు, విద్యాసంస్థలు మరియు ఇతర ప్రదేశాల్లో మహిళలపై జరిగే వేధింపులను అరికట్టేందుకు POSH చట్టం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

మహిళలు తమ హక్కులను తెలుసుకొని ధైర్యంగా ముందుకు రావాలని, సమస్యలు ఎదురైనప్పుడు సంబంధిత అధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మామిళ్ల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, వార్డు కౌన్సిలర్లు సంగనబట్ల సంతోషిని, విరవేణి నాగలక్ష్మీ, జంజిరికాని సువర్ణ, కోఆప్షన్ మెంబర్స్ అశెట్టి మమత, అరుణ, మెప్మా టీఎంసీ రాధ, మహిళా సంఘాల కార్యకర్తలు, మహిళా సంక్షేమ శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, సిబ్బంది మరియు మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply