కొర్రపాటి అమృతేశ్వరుని కటాక్షం వెనుక రాజమౌళి, పురాణపండ !

  • సాయి, రజనీలపై తెలుగు రాష్ట్రాల మేధో సమాజం అభినందనల వర్షం.

బళ్లారి, (ఆంధ్రప్రభ ) : ఇటీవల ఇటు తెలుగుదేశం వర్గాల్లో, అటు సినీవర్గాల్లో వారాహి చలనచిత్రం అధినేతలు, ఈగ, లెజెండ్, కథానాయకుడు చిత్రాల నిర్మాతలు సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి దంపతుల గురించి చర్చ నడిచిందనే చెప్పాలి. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణకి అత్యంత సన్నిహితుడు, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి, రమా రాజమౌళి దంపతులకు ఆత్మబంధువుకంటే ఎక్కువ, ఆస్కార్ సంగీత విజేత ఎంఎం.కీరవాణి, వల్లీ కీరవాణి దంపతులకు కుటుంబ సభ్యుడు, ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక పూర్వ గౌరవ సంపాదకుడు పురాణపండ శ్రీనివాస్.కి అత్యంత ఆత్మీయ స్నేహితుడు అయిన సాయి కొర్రపాటి అత్యద్భుతంగా కోట్ల రూపాయలతో కర్ణాటక బళ్లారిలో నిర్మించిన శ్రీఅమృతేశ్వర దేవాలయం గురించి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, ఫిలింనగర్ వర్గాల్లో చర్చించుకోవడం బాహాటంగా తేటతెల్లమైందనే చెప్పాలి.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వల్ల కొంత, అనేక ఆలయాలు, సోషల్ మీడియా వల్ల వారాహి పేరు ఎక్కువ వినిపిస్తోంది. కానీ దశాబ్దం క్రితమే వారాహి చలనచిత్రం సంస్థను వారాహిమాత అనుగ్రహంగా పెట్టి ఇటు అత్యద్భుతమైన సినిమాలతో పాటు సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించిన ఘనతను సాయి కొర్రపాటి సంపాదించుకున్న విషయం లక్షలమందికి ఎరుకే. సాయి కొర్రపాటి సృజన వల్లనే తన సినీ ప్రస్థాన గురువైన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాను వారాహి చలన చిత్రం బ్యానర్ పై నిర్మించి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించి భారత రాష్ట్రపతి పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దక్కించు కోవడం మహాద్భుతమైతే, తన సాహితీ ఆధ్యాత్మిక మిత్రుడు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్.తో దేశంలోనే మొదటిసారిగా అతి అరుదైన ఆంజనేయమూర్తులు, చిత్రాలతో యంత్ర, తంత్ర మంత్రాత్మకంగా ఐదువందల హనుమంతులతో ఒక అఖండ మహా ఆంజనేయ గ్రంథాన్ని నేనున్నాను పేరిట భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో ఈనాటి భారత హోంశాఖా మంత్రి అమిత్.షాతో ఆవిష్కరింప చేసి ఇంకొక పరమాద్భుతాన్ని సృష్టించి తమ వారాహి చలన చిత్రం ఖ్యాతి దేశపు ఎల్లలు దాటించారు సాయి కొర్రపాటి.

ఇపుడు ప్రధాన చర్చనీయాంశమైన బళ్లారి అమృతేశ్వరాలయం అతి అరుదైన కృష్ణశిలతో సుమారు ఇరవై కోట్లకు పైగా వెచ్చించి నిర్మించి, హిమాలయాల్లోంచి అసాధారణమైన మహా స్పటిక లింగాన్ని తెచ్చి రాజమౌళి, కీరవాణి, పురాణపండ శ్రీనివాస్, కేజీఎఫ్ హీరో యశ్.ల సమక్షంలో గత సంవత్సరం ప్రతిష్టించి తెలుగు చలనచిత్ర సీమలో సంచలనమైన టాక్ కి తెరలేపారు. సాయి కొర్రపాటికి తమతో ఉండే అనుబంధంతో రాజమౌళి దంపతులు అన్నిపనులు మానుకుని ఈ అమృత కార్యక్రమానికి హాజరయ్యారని అప్పుడే టాక్ నడిచింది. కేవలం ప్రముఖ రచయిత, నిస్వార్ధ స్వచ్ఛ హృదయతత్పరుడు పురాణపండ శ్రీనివాస్ స్నేహంతోనే సాయి కొర్రపాటి ఈ పరమాద్భుతమైన సంకల్పం కలిగినట్లు ఇప్పటికీ చలన చిత్ర సీమలో చెప్పుకోవడం గమనార్హం.

తన జీవనయానంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన ప్రతిభాశాలి పురాణపండ శ్రీనివాస్ తన ప్రయాణంలోవ్యాపారాత్మక జీవనానికి చాలాదూరంగా ఒక యజ్ఞమయ నిస్వార్థ జీవనం గడుపుతారనే విషయం రెండు రాష్ట్రాల సాహిత్య ఆధ్యాత్మిక వాదులకు తెలుసు కాబట్టే.. కాసులకు లొంగని శ్రీనివాస్ మహాసంకల్పాలు హైదరాబాద్.లో 25 అభయ గణపతి ఆలయాల ప్రతిష్టకు దారి తీశాయనేది విజ్ఞలోకానికి తెలుసు. అందుకే కాబోలు పరమ భక్తుడిగా మారిన సాయి కొర్రపాటిని రాజమౌళి కుటుంబం సైతం ఆశ్చర్యపోతోందని సన్నిహితులు పేర్కొంటున్నారు.

ఈ క్రెడిట్ సినీరాజకీయ వర్గాలు పురాణపండ శ్రీనివాస్.కే కట్టబెడుతున్నాయనేది నిఖార్సైన నిజం. ఏతా వాతా ప్రస్ఫుటం చేసే అంశమేమంటే ఈ ఏడు వారాహి గుప్త నవరాత్రోత్సవాల్లో సాయి కొర్రపాటి సుమారు పది రోజులు పాటు ఒక వారాహి దీక్ష స్వీకరించి, తన భార్య రజనీ కొర్రపాటితో బళ్లారి అమృతేస్వరాలయంలో చేసిన పవిత్ర మహా కార్యాలు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించడం కొన్ని ఆలయాల్లో, పీఠాల్లో సైతం సాయి కొర్రపాటి నిస్వార్ధ సమర్పణా భావంపై ప్రశంసలు వర్షిస్తున్నాయనేది నిజం.

Leave a Reply