ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి

విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర..

విజయవాడ కార్పోరేషన్, ఆంధ్ర‌ప్ర‌భ : విజయవాడ నగర పాలక సంస్థ పరిధి లో నిర్వహిస్తున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం లో భాగంగా ఆదివారం హనుమాన్‌ పేట లో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌ ను విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన చంద్ర మాట్లాడుతూ, ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి తప్ప నిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. పోలియో నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

తల్లి దండ్రులు ఎలాంటి నిర్లక్ష్యం చేయ కుండా తమ చిన్నారులను సమీపంలోని పోలియో బూత్‌లకు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో కేంద్రానికి రాలేని చిన్నారులకు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేసేందుకు ప్రత్యేక బృందాలు సేవలందిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.