ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ జట్టు ఎంపిక.

విశాఖలో జరిగే రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లా పోటీలకు క్రీడాకారుల ఎంపిక
సర్ విజ్జీ మున్సిపల్ కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్
సబ్‌జూనియర్, జూనియర్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఈతగాళ్లకు అవకాశం
జూలై 18, 19 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా తరఫున బరిలోకి
క్రీడాకారులకు అభినందనలు తెలిపిన అతిథులు, కోచ్‌లు

విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ గాంధీనగర్‌లోని సర్ విజ్జీ మున్సిపల్ కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్‌లో సబ్‌జూనియర్, జూనియర్ విభాగాల జిల్లా స్థాయి ఎంపిక (సెలక్షన్ ట్రయల్స్) పోటీలు నిర్వహించారు.ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఈతగాళ్లను జూలై 18, 19 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న 11వ సబ్‌జూనియర్, జూనియర్ అంతర్‌జిల్లా స్విమ్మింగ్ పోటీలకు ఎన్టీఆర్ జిల్లా జట్టుగా ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ కొంగర రవికాంత్ హాజరై క్రీడాకారులను అభినందించారు. స్విమ్మింగ్ పూల్ ఇన్‌చార్జి నవీన్ ఈవెంట్ స్టార్టర్‌గా వ్యవహరించారు. పోటీల నిర్వహణలో కోచ్‌లు ఎం. మలయాధ్రి, లక్ష్మణ్, ఎస్‌కే రఫీ, ఆర్. గౌతమ్ కీలక పాత్ర పోషించారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో ఎన్టీఆర్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అతిథులు ఆకాంక్షించారు.