భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన ఖాతాలో మరో స్వర్ణాన్ని చేర్చుకున్నాడు. JSW స్పోర్ట్స్‌తో కలిసి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన నీరజ్ చోప్రా క్లాసిక్‌లో నీరజ్ అంచనాలను అందుకున్నాడు.
భారత్‌లో తొలిసారి నిర్వహించిన అంతర్జాతీయ జావెలిన్ ఈవెంట్‌లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. బెంగళూరులో తన పేరుతో జరిగిన ‘‘నీరజ్ చోప్రా క్లాసిక్ టోర్నమెంట్’’ మొదటి సీజన్ టైటిల్‌ను గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా సొంతం చేసుకున్నాడు.
ఈ పోటీలో భారత స్టార్ నీరజ్ తన జావెలిన్‌ను 86.18 మీటర్ల దూరం విసిరి అగ్ర స్థానంలో నిలిచాడు. మరోవైపు కెన్యాకు చెందిన జూలియస్ యోగో 84.51 మీటర్లు రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకోగా.. శ్రీలంక అథ్లెట్ రమేశ్ పతిరణ 84.34మీ. మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు. భారత్‌కు చెందిన సచిన్ యాదవ్ 82.23 మీటర్లు తృటిలో బ్రౌన్జ్ మెడల్‌ను చేజార్చుకున్నాడు.
