సీసీ రోడ్డు ప్రారంభించిన సర్పంచ్..
టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఆరేపల్లిగ్రామ అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ కుర్రె మల్లయ్య ఘనంగా ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామస్థులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు సీసీ రోడ్డు నిర్మాణం వల్ల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు.
