MARKET |నిలిచిన పత్తి కొనుగోలు

MARKET |నిలిచిన పత్తి కొనుగోలు
ఏనుమాముల మార్కెట్ వెలవెల!
MARKET | ఉమ్మడి వరంగల్ ఆంధ్రప్రభ : సీసీఐ పత్తి కొనుగోలు నిలిపి వేయడంతో వరంగల్‌లో ఉన్న అంతర్జాతీయ మార్కెట్ ఏనుమాముల (Elephants) మార్కెట్ వెలవెలబోయింది. జిన్నింగ్ మిల్లులపై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) నిబంధనలు తొలగించాలనే డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తంగా కాటన్ మిల్లుల అసోసియేషన్ ఈ రోజు నుండి పత్తి కొనుగోల్లు నిలిపివేసింది. ఆసియాలోని రెండో అతిపెద్ద మార్కెట్ (Market) గా గుర్తించబడిన వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులోకి అమ్మకానికి పత్తి రాలేదు. ముందస్తు సమాచారంతో పత్తి రైతులు రాలేదని మార్కెట్ కమటీ అధికారులు తెలిపారు.
