Traffic Police | డ్రంక్ అండ్ డ్రైవ్ ప‌రీక్ష‌లు

Traffic Police | డ్రంక్ అండ్ డ్రైవ్ ప‌రీక్ష‌లు

  • రెండు రోజుల్లో 457 మందిపై కేసులు

Hyderabad | ఖైరతాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : రోడ్డు భ‌ద్ర‌త వారోత్స‌వాలు సంద‌ర్భంగా హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Hyderabad Traffic Police) రెండు రోజుల పాటు డ్రంక్ అండ్ డ్రైవ్‌(drunk and drive)పై ప్ర‌త్యేక డ్రైవ్(Special Drive) నిర్వ‌హించిన‌ట్లు ట్రాఫిక్ జాయింట్ కమిష‌న‌ర్ తెలిపారు. నిన్న, శుక్ర‌వారం రెండు రోజుల‌పాటు నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో 457 మంది డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.

వారిలో 377 మంది ద్విచక్ర(377 two-wheelers) వాహనదారులు, 27 మంది ఆటో డ్రైవ‌ర్లు, 53 నాలుగు చక్రాల వాహనదారులు, ఇత‌రులు ఉన్నారు. రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ (బీఏసీ) ఒక‌సారి ప‌రిశీలిస్తే… 83 మంది 30-50, 194 మంది 51-100, 104 మంది 101-150, 44 మంది 151-200 , 14 మంది 201-250 , 14 మంది 251-300 బీఏసీ పాయింట్లు(BAC Points) ఉన్న‌ట్లు గుర్తించారు. న‌లుగురు మూడు వంద‌ల‌కు పైగా 300 పాయింట్లు ఉన్నాయి.

Leave a Reply