1.15 Crore | లెక్కలతో సహా చెప్తాం…
1.15 Crore | లెక్కలతో సహా చెప్తాం…
1.15 Crore | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ హామీలు నెరవేర్చట్లేదని ఆరోపించడం సరికాదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ హామీలు నెరవేర్చట్లేదని ఆరోపించడం సరికాదన్నారు. ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరిందనేది లెక్కలతో చెబుతామన్నారు. అర్హులైన 53లక్షల మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాల్లో 1.06 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. పెద్దఎత్తున సన్న బియ్యం ఇవ్వడం దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు. గతంలో పేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామన్న హామీ ఏమైంది ? అని ప్రశ్నించారు. ఏడాదిలో 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నామన్నారు. నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు. పేదల ఇళ్లకు రూ.5 లక్షల చొప్పున అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలోని మహిళలను మహాలక్ష్ముల్లా గౌరవిస్తామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ప్రతినెలా ఆర్టీసీకి ఆర్టీసీ బస్సుల టికెట్ల డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతులకు రైతుభరోసా నిధులు ఇస్తున్నామన్నారు. రైతులకు ఎకరా పేరిట రూ.25వేల బోనస్ వస్తోందన్నారు. పెండింగ్ అసలు, వడ్డీలు కడుతూ పథకాలు అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
