Protest | ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలి

Protest | ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలి

  • గాంధీ విగ్రహం ఎదుట ఎమ్మెల్యే జీఎస్ఆర్ నిరసన

Protest | భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : పేదల ఉపాధి దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని, పథకాల నుంచి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం సరికాదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డిమాండ్ చేశారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రం మంజూరునగర్ లోని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ధర్నాలో ఎమ్మెల్యే గండ్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొద్దిసేపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఉపాధిని దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందన్నారు. పేదల కడుపు నింపే లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన ఇలాంటి పథకం ప్రపంచంలో ఏ దేశంలో లేదన్నారు. గాంధీ పేరును తొలగించి ఆయన ప్రతిష్ఠను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని యెడల పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ నిరసన ధర్నాలో పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply