Patients Kidnop : కమీషన్ల దాదా MBBS

Patients Kidnop : కమీషన్ల దాదా MBBS
- ఏలూరులో సర్వరోగ హింసాసుపత్రి అధిపతి
- సర్కారు దవాఖానాలో.. ప్రైవేటు ఆసుపత్రుల దందా
- వారం వారం ఉచిత మెగా మెడికల్ క్యాంపులు
- తెరమీదకు మాయ రోగ టెస్టులు
- సూపర్ స్పెషాలిటీ వైద్యం బురఖా
- ఆరోగ్య శ్రీ వలలో.. రోగుల తరలింపు కలెక్టర్ ఆర్డర్లూ ఇక్కడ బేఖాతరు
( ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో)

జనం కష్టార్జిత కప్పంతో.. ఎంబీబీఎస్ చదివి.. అదే జనం ఆరోగ్య రక్షణకు కంకణ బద్దులుగా.. సర్కారీ దవాఖానాలో సేవలు ప్రారంభిచిన నయా డాక్టర్ గిరిలు.. ప్రైవేటు ఆసుపత్రులకు బంట్రోతులుగా మారిపోయారు. ఇది కేవలం ఆరోపణ కాదు. యథార్థం. ఇందుకు ప్రత్యక్ష్య సాక్ష్యం ఏలూరు ప్రభుత్వ సర్వజన దవాఖానాలో కమీషన్ల దాదా (Commissions Mbbs Dada) ఎంబీబీఎస్ ( స్టోరీ.
ఈ ఆసుపత్రిలో.. కోట్లకు కోట్లు సర్కారు సొమ్ము తినవచ్చు. లెక్కలు అడక్కూడదు. ఏలూరు ఎంపీ సమకూర్చే అత్యాధునిక పరికరాలను పక్కనే పెట్టొచ్చు. ఇది సరే.. రోగంతో వచ్చే పేదల్ని ప్రైవేటు ఆసుపత్రులకు అప్పగించవచ్చు. కమీషన్ దండుకోవచ్చు. ఇంత జరుగుతున్నా.. ప్రజాప్రతినిధులు, ఉన్నాతాధికారులు ఈ ఆసుపత్రిలో ఆగడాలపై ఫోకస్ పెట్టకపోవటమే.. ఇక్కడ మరో ట్విస్ట్. మామూళ్ల డాక్టర్ల కథ తెలుసుకోవాలంటే.. అలా ఏలూరు వెళ్తే.. ఆశ్చర్యం సామాన్యం.
Patients Kidnop : పేషెంట్స్ అనధికార కిడ్నాప్ స్టోరీ గురూ

జిల్లా కేంద్రం ఏలూరు సిటీ. కలెక్టరేట్ కు కూతవేటు దూరంలో రోగులతో కిటకిటలాడుతూ ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (Eluru GGH) కనిపిస్తుంది. ఆసుపత్రి ప్రాంగణంలో మెగా వైద్య శిబిరాలు ( Free Mega Medical Camp) పలకరిస్తాయి. పర్కాలేదు, మన సర్కారీ డాక్టర్లు పేదోళ్లకు దగ్గరయ్యారు. ఇంత మంది డాక్టర్లు ఎక్కడి నుంచి వచ్చారబ్బా.. బాగానే పరీక్షలు చేస్తున్నారని భావిస్తే.. తప్పులో కాలేసినట్టే గురూ.
ఈ మెగా ఉచిత వైద్య శిబిరంలో టెస్టులు చేస్తోందెవరంటే.. సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు. ఔనా… అని ముక్కున వేలు వేసున్నారా.. నిజం.. ఇది నిజం. ప్రభుత్వ ఆసుపత్రి భవనాలను, ప్రభుత్వం ఖర్చు భరించే విద్యుత్తును, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఈ సూపర్ డాక్టర్లు యథేశ్చగా వాడేస్తున్నారు. సర్వజన ఆసుపత్రి క్యాజువాలిటీకి (Casuality ) వచ్చిన రోగులను.. లైన్ లో నిలబడక ముందే (Out patients) ఉచిత మెడికల్ మెగా క్యాంపునకు ట్రెయినీ నర్సులు అత్యంత ప్రేమగా తరలిస్తారు. ఇక్కడే అసలు దందా షురూ అవుతుంది. బీపీ, షుగర్ టెస్టులు ఉచితం. ఆ తరువాతే.. అసలు పరీక్షలు తెరమీదకు వస్తాయి.
గుండె నాళం మూసుకు పోయినట్టుందే. ఊపిరితిత్తులు ఎండిపోయాయి. లివర్ దెబ్బతిన్నట్టుందే.. కిడ్నీ పని చేయట్లేదు.. యాంజియో గ్రామ్ (Angio gram) చేయాలి. సిటీ స్కాన్ (City Scan) చేస్తే మంచింది. అని ఈ సూపర్ మెగా డాక్టర్ స్టార్లు పెదవి విరుస్తారు. ఇంకేముందీ.. రోగి గుండెల్లో అలజడి స్టార్ట్ కాగానే.. పర్వాలేదు.. ఆరోగ్యశ్రీ (Arogyasri) ఉంది. అన్ని పరీక్షలు, ఆపరేషన్ చేస్తాం. మా సూపర్ స్పెషాలిటీకి వచ్చేయండి, అని మరో ఉచిత సలహా ఇవ్వటం సర్వసాధారణమైంది.
ఇలా.. తమ వద్ద అన్ని వసతులు అన్ని రకాల చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీలోనే అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రోగులను తమ ప్రైవేటు ఆసుపత్రికి (Patients Kidnap) యధేశ్చగా తరలిస్తున్నారు. ఇలా.. ప్రైవేటు ఉచిత మెగా క్యాంపుల్లో రోగుల్ని రిక్ర్యూట్ చేస్తూ.. అంచెలంచలుగా తమ టర్నోవరును కోట్లకు పెంచుతున్నారు. వీరికి ప్రభుత్వాసుపత్రి అధికార యంత్రాగం దాసోహమైంది. ఇది కేవలం ఆరోపణ కాదు. నిజానికి పేషెంట్ కి అంత అవసరం ఉందా లేదా అనే అంశాన్ని కనీసం ప్రభుత్వ డాక్టర్లు పర్యవేక్షించటం లేదు.
పైగా అటువైపు కూడా కన్నెత్తి చూడడం లేదు. ఇందుకు కారణం తమకు పని భారం తప్పింది, కమీషన్ జోలె నిండుతోంది. అసలు ప్రభుత్వ ఆసుపత్రి (In GGH) లో ప్రైవేటు ఆసుపత్రులు వచ్చి (Private Hospitals) ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించటమే విడ్డూరం. ఇందుకు అనుమతులను ఎవరు మంజూరు చేశారు. ఏ ఏ ప్రాతిపదికను అంచనా వేశారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే.. ఆ ఒక్కటీ అడక్కూడదు.
Patients Kidnop : మంత్రి ప్రశ్నకూ.. మౌనమే ఆన్సర్

కనీసం డీఆర్సీ మీటింగ్ లో సాక్షాత్తు జిల్లా ఇన్ చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ వివిధ ప్రశ్నలు వేశారు. ట్రామా కేర్ (Trauma care) లో ఎన్ని పడకలు (Beds) ఉన్నాయి, సగటున రోజుకు ఎంత మంది రోగులు ట్రామా కేర్ లో వైద్య సేవలు పొందుతున్నారు, ఏమైనా మరిన్ని వసతులు అవసరమా? అని అడిగిన ప్రశ్నలకు ఏలూరు సర్వజన ఆసుపత్రి ఇన్ చార్జి సూపరింటెండెంట్ సమాధానం మౌనం. ఈ సమాచారం లేక పట్టపగలే చుక్కలు లెక్కబెట్టారు. ఈ స్థాయిలో సర్వజన ఆసుపత్రి పని చేస్తున్న నేపథ్యంలో ఆసుపత్రిలోని వైద్య సేవలు అందుకుంటున్న రోగుల పరిస్థితి ఇక వర్ణనాతీతమే,?
Patients Kidnop : డెడ్ బాడీల గాయబ్ కథలెన్నో..

ఇక ఖర్మకాలి సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లకు కుట్లే పెద్ద శాపం. ఆ కుట్లు చీము పట్టి, రికవరీ కాకపో వడంతో నెలలు తరబడి ఇదే ఆసుపత్రిలో అదే మంచంపై పేషెంట్ (Paient) గా కొనసాగిన కేసులు అనేకం. విచిత్రమింటంటే ఈ హాస్పిటల్ లోని మార్చురీ క్యాబిన్ (Motuary) నుంచి శవాలు సైతం రాత్రికి రాత్రి మాయమైన సందర్భాలు కూడా ఉన్నాయి.
కొందరైతే చనిపోలేదని స్పృహ కోల్పోయారని అనంతరం మెలుకువలోకి వచ్చిన తర్వాత వెళ్లిపోయారంటూ చెబుతుంటే, మరికొందరు మార్చురీలో (Dead Bodies) శవాలను రాత్రికి రాత్రే అంబులెన్స్ లో వేరే మెడికల్ కాలేజీలకు (Medical colleges) తరలించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కేసులు నమోదు చేసిన ఘటనలు ఈ ఆసుపత్రిలో ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు మార్చురీ నుంచి మాయమైన ఏ ఒక్క శవం కథ తేలలేదు. ఎందుకంటే ఆ మిస్టరీ స్టోరీ కంచికి చేరింది.
- Patients Kidnop సీసీ కెమెరా నిఘా ..ట్రాష్ కథ

ఈ సర్వజన ఆసుపత్రిలో అనేక యదార్థ ఘటనలే సాక్ష్యాలు. ఈ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పని చేయవు. నెలనెల ప్రైవేటు సెక్యూరిటీకి అప్పనంగా జీతభత్యాలు యథాతథం. ఆసుపత్రి ప్రాంగణంలో పార్క్ చేసిన కార్ల టైర్లను, బైకులను చోరీ చేసే (Theft Gang) గ్యాంగ్ కు.. ఈ ఆసుపత్రి చోరీ ధామం. ఇక్కడ జరిగే చోరీలపై చర్యలు శూన్యం.
ఎందుకంటే .. ఇవ్వన్నీ ఆధారాలు లేని నేరాలే. ఈ ఆసుపత్రిలో 24 గంటలు సీసీ కెమెరాలు, (CC Camaras) సెక్యూరిటీ గార్డుల (Security Gaurds) నిఘా, శానిటేషన్ పనులన్నీ ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. భారీ మొత్తంలో (కోట్ల రూపాయల్లో) టెండర్ల రూపంలో ప్రైవేటే గ్యాంగ్ దండుకుంటోందే గానీ.. చోరీలకు అడ్డుకట్ట వేయటం లేదు.
పోలీసులు కేసు దర్యాప్తు సమయంలో సీసీ కెమెరాలను, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని పరిశీలిస్తే.. కొంతమంది విధులలో లేమని, మరి కొంతమంది వేరే చోట సంస్థ విధుల్లో ఉన్నామని చెబుతున్నారు.. ఇక సీసీ కెమెరాలు పని చేయడం లేదు. అని తేల్చి చెబుతున్నారు. మరి పని చేయని సీసీ కెమెరాలు ఖర్చు దేనికే కమీషన్ దాదా ఎంబీబీఎస్ కే ఎరుక.
Patients Kidnop : మెడికోలూ సై.. సై

ఈ మధ్యకాలంలో మెడికోలూ ఎలుకల బారిన పడ్డారు. వీళ్లను ఎలుకలు కొరికిన ఘటనలు తెరపైకి వచ్చాయి. ఈ మెడికోల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా.. చర్యలు శూన్యం. ఇది సరే.. కొత్తగా ర్యాగింగ్ రగడ తెరమీదకు వచ్చింది. ఆసుపత్రి సమీపంలోని హాస్టల్లోనే అతిగా మందు కొట్టి ఓ మెడికో గ్యాంగ్ (medicos) చిందులేసింది.
డిసెంబర్ 1వ తేదీ సోమవారం రాత్రి సీనియర్ మెడికోలు జూనియర్లను ఆటపట్టించారు. అర్దరాత్రి సమయంలో వేధింపులకు గురి చేశారు. ర్యాగింగ్ పేరుతో తమను ఇబ్బందులు పెడుతున్నట్లుగా, ఇరు వర్గాలు సోమవారం రాత్రి ఆసుపత్రి పరిసరాలలోని (Direct Fight) బాహా బాహికి దిగారు. సై అంటే సై అనే స్థాయిలో కొట్టుకున్నారు. తిట్టుకున్నారు.
ఇందుకు పేషెంట్ల దగ్గర ఉన్న అటెండెంట్ లే ప్రత్యక్ష సాక్షులు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామునే పోలీసులు రంగ ప్రవేశం (Poice Involved) చేసి గొడవను కాస్త సద్దుమణిగే చర్యలు చేపట్టారు.
Patients Kidnop : కలెక్టర్ ఆర్డర్లూ బేఖాతర్.

.ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాల ప్రవేశం.. వీరికి అన్ని వసతులు ఏర్పాటు చేయడంపై కనీసం జిల్లా కలెక్టర్ కు సైతం తెలియదు. పత్రికల్లో వార్తలతో ఈ విషయం తెలిసి కలెక్టర్ తక్షణమే (Collector Serious) స్పందించి ఉచిత మెడికల్ క్యాంపులను ఆసుపత్రి ఆవరణ నుంచి బయటకు పంపించాలని, అసలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రిల ఫ్రీ క్యాంపులను నిర్వహించడానికి ఆదేశాలు ఎవరు ఇచ్చారని, ఈ విధమై న ఫ్రీ మెడికల్ క్యాంపులను ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్వహించడానికి ఆదేశాలు మంజూరు చేసే అర్హత ఎవరికి ఉందని, అందుకు తగిన ఆధారాలు కూడా చూపాలంటూ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ కు కలెక్టర్ (ordered) ఆదేశాలు జారీ చేశారు.
Patients Kidnop :

ఇప్పటివరకు కలెక్టర్ కు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పైగా ఉచిత మెడికల్ క్యాంపుల నిర్వహణకు అనుమతులు ఉన్నాయని ప్రభుత్వ ఆసుపత్రి (GGH Superitandent) సూపరింటెండెంట్ టెంపర్ ప్రదర్శిస్తున్నారు. ఈ అనుమతి కాపీని గానీ, అనుమతి పొందిన విధానాన్ని గాని ఇప్పటికీ గోప్యంగానే ఉంచడంలో.. పరమార్థం ఏమిటో జనానికి అర్థం కావటం లేదు. అను న్యూరోసర్జన్ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం (Anu Nuro Surgeon Hospital) మాత్రం.. ప్రతి మంగళ శుక్రవారం యథేశ్చగా ఉచిత మెగా మెడికల్ క్యాంపును నడుపుతూనే ఉంది. ఈ రోగుల ప్రైవేటు కిడ్నాప్ నకు ఏ కమీషన్ దాదా ఎంబీబీఎస్ ప్లానో.. ఎవ్వరికీ అంతుబట్టక పోవటం.. అసలు విశేషం.
