పశ్చిమ నియోజకవర్గంలో కృంగిన సిమెంట్ రోడ్డు…
చిట్టినగర్, జులై 30 (ఆంధ్రప్రభ) : విజయవాడ పశ్చిమ నియోజక వర్గం 48వ డివిజన్ లో శ్రీ కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మంటపం ఎదురు గా ఉన్న రాయప్ప రాజు వీధిలో సిమెంట్ రోడ్డు బుధవారం ఉదయం కృంగి పోయింది. ఆ వీధి మొదట్లో సొరంగం రోడ్డు ఉన్న నిర్మాణం లో భవనం కోసం ఇటుకల లోడ్ వచ్చింది. ఇటుకల లోడ్ తో ఉన్న ట్రాక్టర్ ను వీధి లో చాలా సేపు నిలిపి ఉంచారు. దాంతో ఆ బరువు కు సిమెంట్ రోడ్డు కృంగి పోయింది అని స్థానికులు చెబుతున్నారు. గతంలో రాయప్ప రాజు వీధి నుండి సొరంగం మెయిన్ రోడ్డులోకి ద్విచక్ర వాహనాలు సులభంగా వెళ్ళిపోయే వాళ్ళం.
ఇప్పుడు వీధిలో నుండి మెయిన్ రోడ్డులోకి వెళ్ళకుండా రోడ్డు కృంగి పోయింది. దాంతో వీధికి రెండు వైపుల నుండి నగరాలు సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ప్రక్క వీధి నుండి వెళ్ళవలసి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఆ వీధిలో ఒక ప్రక్కన అయితే పెద్ద గొయ్యి పడింది. ఈ రోడ్డును ఇలానే వదిలేస్తే ఇంకా కృంగి పోతుందని స్థానికులు అంటున్నారు. బాగా ఉన్న రోడ్డు కాస్తా అదే వీధి మొదట్లో ఉన్న నిర్మాణంలో భవనం నిర్మాణ సామాగ్రి కోసం పాడైపోయిందంటూ స్థానికులు అంటున్నారు. దాంతో వీధిలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేసి యధాస్థితికి తీసుకు రావాలని కోరుతున్నారు.
