ఘనంగా రంజాన్ వేడుకలు..

లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ పండుగ వేడుకలను శనివారం ముస్లీమ్ లు ఘనంగా జరుపుకున్నారు. భక్తి, శ్రద్ధలతో ఈద్గాల వద్ద ప్రత్యేక సామూహిక ప్రార్ధనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా రంజాన్ పండుగ (ఈద్ ముబారక్ ) శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత మరింతగా బలపడాలని ఆకాంక్షించారు. ఈద్ ఉల్ ఫితర్ ను భక్తి శ్రద్ధలతో సోదర భావంతో నిర్వహించారు.మత పెద్దలు ఈద్గాల వద్ద సామూహిక నమాజ్ లలో దైవం అందించిన దివ్య ఖోరాన్ వాక్కులను ఉపదేశించారు.

దేవుని కృప పొందటానికి ముస్లీమ్ లు ఆచరించవలసిన నియమాలు, వాటి ప్రాధాన్యతను వివరించారు.అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. పండుగను పురస్కరించుకొని మున్సిపల్ చైర్మన్ పర్సన్ దొంత అంజలి – నర్సయ్య, వైస్ చైర్ పర్సన్ మోత్కూరి రాజేశ్వరి- వెంకటస్వామి గౌడ్,పలువురు కౌన్సిలర్లు ముస్లీమ్ లకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ మత సామరస్యంతో నడుచుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరీఫ్, కౌన్సిలర్లు బిరుదుల సత్యనారాయణ, చిన్నయ్య, సుజాత -రమేష్, పెండెం పద్మ -రాజు, రాజేంద్ర ప్రసాద్, నాయకులు రాందేని వెంకటేష్, నవాబ్,హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.