ఆత్మనిర్భర్ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్

ఆత్మనిర్భర్ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్

ఉట్నూర్, ఆంధ్రప్రభ : పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాదులో నిర్వహించిన ఆత్మ నిర్భర్ పై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆహ్వానం రావడంతో ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్ ఈవో శంకర్, పాల్గొన్నారని తెలిపారు.

అదిలాబాద్ జిల్లా నుండి ఉట్నూర్ సర్పంచ్ కు అవకాశం ఇవ్వడం పై ఎంతో సంతోషంగా ఉందని సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ చట్టాలపై పంచాయతీల నిర్వహణపై ఎంతో అవగాహన కల్పించాలని సర్పంచ్ పేర్కొన్నారు.