ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసుకోవాలి..

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసుకోవాలి..
నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా లబ్ధిదారులు, తమకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా దిలవార్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో మౌనిక అనే లబ్ధిదారురాలుకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటివరకు పూర్తిచేసిన ఇంటి నిర్మాణ పనుల వివరాలు, అయిన ఖర్చు, ప్రభుత్వ మంజూరు చేసిన నిధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చివరి దశగా మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి చేసుకోవాలన్నారు. హౌసింగ్ అధికారులతో మాట్లాడుతూ, ఇంటి నిర్మాణాలు నాణ్యవంతంగా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఇప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలని పేర్కొన్నారు. సంబంధిత యాప్ లో ఆయా దశల్లో ఇంటి నిర్మాణాల ఫోటోలు నమోదు చేసి, లబ్ధిదారులకు సకాలంలో డబ్బులు అందే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వం అందించే ఆయా పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయో లేవో అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శంకర్, తహసిల్దార్ ఎజాజ్ అహ్మద్, ఎంపీడీవో అరుణ, సర్పంచ్ చైతన్య, హౌసింగ్ అధికారులు, తదితరులు ఉన్నారు.
