డీఈఓకు ఆర్యవైశ్య సంఘం శుభాకాంక్షలు..
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లాకు బదిలీపై జిల్లా విద్యాశాఖాధికారిణి (డీఈఓ)గా బాధ్యతలు స్వీకరించిన రోహిణిని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, మా ఇల్లు సంస్థ సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర మహాసభ ప్రధాన కార్యదర్శి, వాసవి మాత ఆలయ కమిటీ చైర్మన్ తోపాజీ అనంత కిషన్, సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్, సంఘం ప్రధాన కార్యదర్శి నామా భాస్కర్ గుప్తా, సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి, జిల్లా పరిశ్రమల శాఖ సూపరింటెండెంట్ ఇరుకుల ప్రదీప్ గుప్తాలు డీఈఓ రోహిణికి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. జిల్లా విద్యారంగ అభివృద్ధికి తమ సంఘం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు.
