ప్రీ ప్రైమరీ తరగతులకు అనుమతి..
చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు మండలంలోని ఏడు పాఠశాల లో ప్రీ ప్రైమరీ(ఇంగ్లిష్ )తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించిందని మండల విద్యాధికారి కొత్తవండ్ల సత్యనారాయణ తెలిపారు.చెన్నూరు పట్టణంలోని పద్మనగర్, దుగ్నేపల్లి,ఎల్లక్కపేట, కొమ్మేరా, వెంకంపేట,సంకా రం,అక్కేపల్లి మండల ప్రజాపరిషత్ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ జరుగుతుందని, 3సంవత్సరల నుంచి ఆరు సంవత్సరాలు లోపు పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాల లో చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్య బోధనను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ ఉంటుందని, ఈ నెల 12నుంచి ప్రవేశాలు ప్రారంభం చేయనున్నట్లు వెల్లడించారు.
